విధి నిర్వహణలోనూ అన్నాచెల్లెళ్ల అనుబంధం
గూడెం కొత్తవీధి,పెన్ పవర్ ఆగస్టు 28: అరకులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్న జీకేవీధి తహశీల్దార్ అన్నాజీరావు, చింతపల్లి తహశీల్దార్ ఆయన సోదరి త్రివేణి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా అరకులో ఉన్న వీరు రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టుకుని పండుగను జరుపుకున్నారు.విధి బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తూనే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి విలువనిస్తూ వారు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.