వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మావూరి రామారావు మృతి
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు 7:గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ మాజీ వైస్ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మావూరి రామారావు గురువారం రాత్రి 9.55 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.రామారావు మృతి తమ కుటుంబానికి, ఆత్మీయులకు తీరని లోటని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పేర్కొన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.మావూరి రామారావు...