స్థానిక ఎన్నికలపై జనసేన సమన్వయ కమిటీలకు బాధ్యతలు

27న పాడేరులో సమన్వయ కమిటీ సమావేశం స్టాఫ్ రిపోర్టర్, పాడేరు, పెన్ పవర్, ఆగస్టు 25: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా పాడేరు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు. ఆయా కమిటీ సభ్యులు తమ పరిధిలోని పంచాయతీల వారీగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న ఆశావహుల వివరాలను సేకరించాలని సూచించారు. రెండు మూడు రోజుల్లోగా...