స్థానిక ఎన్నికల్లో వైసీపీదే విజయం:రాష్ట్ర వైసీపీ పంచాయతీరాజ్ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్
గూడెంకొత్తవీధిలో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యం గూడెంకొత్తవీధి, పెన్ పవర్, ఆగస్టు 25: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడెంకొత్తవీధి మండలంలో సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వైసీపీ పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ తెలిపారు. పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు నాయకత్వంలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ఓ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు.మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలు చేసిన...