స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి:ఎమ్మెల్యే మత్స్య రస విశ్వేశ్వరరాజు

గూడెంకొత్తవీధి,పెన్ పవర్ ఆగస్టు 27:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసుకుంటోందని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన...