హరిద్వార్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు నర్సీపట్నం నింజాస్ అకాడమీ క్రీడాకారులు
నర్సీపట్నం, పెన్ పవర్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న 6వ జాతీయ గ్రాఫ్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలకు నర్సీపట్నం నింజాస్ అకాడమీకి చెందిన 18 మంది క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొననున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కోచ్‌గా నర్సీపట్నానికి చెందిన వేపాడ ప్రియాంక వ్యవహరించనున్నారు. ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రాఫ్లింగ్ కమిటీ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో ప్రతిభ కనబరిచి...