1053 కిలోమీటర్ల ‘గ్రేట్ గ్రీన్ వాల్’..
తీరాన్ని కాపాడే ప్రకృతి కవచమా..? వాతావరణ మార్పుల సవాళ్లకు ఆంధ్రప్రదేశ్ కొత్త హరిత వ్యూహం పెన్ పవర్ ప్రత్యేక కథనం, నెల్లూరు, ఆగస్టు 5 : వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలకు కొత్త సవాళ్లను విసురుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక హరిత ప్రణాళికకు శ్రీకారం చుడుతోంది. "గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" పేరుతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని సహజ హరిత కవచంతో అనుసంధానించాలనే లక్ష్యంతో ముందుకు...