25వ వార్డు ప్రజలు మా సొంత కుటుంబ సభ్యులు : చింతకాయల రాజేష్
నర్సీపట్నం మున్సిపాలిటీలో ఘనంగా 'ఇంటింటికి తెలుగుదేశం'.. భారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం... నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం పట్టణంలోని 25వ వార్డులో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం శనివారం పండుగ వాతావరణంలో జరిగింది. వార్డు మహిళలు హారతులు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ తిరిగి గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ...