విలీన మండలాల్లో 26 రహదారులు దిగ్బంధం, 618 ఇళ్లు ముంపు
చింతూరు డివిజన్‌లో వరద పరిస్థితిపై కలెక్టర్ సమీక్ష – రంపచోడవరం/చింతూరు, పెన్ పవర్, ఆగస్టు 1: చింతూరు డివిజన్‌లో గోదావరి, శబరి నదుల వరద పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ శనివారం ఉదయం 8 గంటలకు ఫ్లడ్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.30 అడుగులుగా ఉండి ప్రమాద స్థాయికి దిగువన ఉందని, చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 34.40 అడుగులుగా నమోదై ప్రమాద స్థాయికి చాలా తక్కువగా ఉందని తెలిపారు....