కంటైనర్ ఢీకొని చేపల వ్యాపారి మృతి
కంటైనర్ ఢీకొని చేపల వ్యాపారి మృతి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 11: చేపల కొనుగోలు కోసం ఫిషింగ్ హార్బర్‌కు వెళ్తున్న ఓ చేపల వ్యాపారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గుర్ల మండలం కలవచర్ల గ్రామానికి చెందిన గుమ్మడి సూర్యనారాయణ (50) ఈ ప్రమాదంలో మృతి చెందారు. రోజువారీగా సొంత గ్రామం నుంచి విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు వచ్చి చేపలను కొనుగోలు చేసి, వాటిని తిరిగి గ్రామానికి తీసుకెళ్లి విక్రయిస్తూ...