మరుగునపడిన మహిళలకు చరిత్రలో చోటు!

“చరిత్ర మరచిన మహిళలకు అక్షర నివాళి!” బహుజన మహిళల సేవలను వెలుగులోకి తెచ్చిన డా. తెన్నేటి జయరాజు ‘భారతీయ బహుజన మహిళా ప్రముఖులు’ గ్రంథావిష్కరణలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి విశాఖపట్నం, పెన్ పవర్ ఆగస్టు 29: చరిత్రలో గుర్తింపునకు నోచుకోని అనేక మంది బహుజన మహిళల జీవితాలు, సేవలు, విజయాలను వెలుగులోకి తీసుకువచ్చి వారికి చరిత్రలో సముచిత స్థానం కల్పించే ప్రయత్నం అభినందనీయమని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శనివారం శ్రీమతి...