205 మండలాల్లో దారుణ పరిస్థితులు..!

వాన జాడ లేదు... ఖరీఫ్‌కు గండం..! రాష్ట్రంలో 50.80 శాతం వర్షపాతం లోటు... 43 శాతానికే పరిమితమైన సాగు..! వాతావరణ అంచనాలతో మరింత ఆందోళనలో అన్నదాత..! ఏలూరు, పెన్ పవర్, ఆగస్టు 5: ఆకాశం వైపు ఆశగా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతుకు ప్రకృతి ఈసారి కూడా కరుణ చూపడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాల కోసం ఎదురుచూస్తూ విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతు ఇప్పుడు...