కొండపల్లిలో పోస్టల్ సేవలపై అవగాహన సదస్సు
పోస్టాఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచన గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, ఆగస్టు 2: పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామంలో పీసా గ్రామసభ ఉపాధ్యక్షుడు కోటం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు పోస్టల్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) అప్పలకొండ భారత తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను ప్రజలకు వివరించారు. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ), సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, స్పీడ్ పోస్ట్,...