బలూచిస్థాన్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సురబ్‌లో కర్ఫ్యూ, ఖుజ్దార్‌లో కఠిన ఆంక్షలు

ఆగస్టు 15 వరకు కర్ఫ్యూ.. రాత్రివేళల్లో బలూచిస్థాన్‌లో భద్రతా ఆంక్షలు బలూచిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు తెరపైకి వచ్చాయి. సురబ్ జిల్లాలో రాత్రివేళ కర్ఫ్యూ, ఖుజ్దార్‌లో వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలు విధించడంతో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సురబ్‌లో వారం రోజుల పాటు కర్ఫ్యూ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్ బలూచిస్థాన్‌లోని సురబ్ జిల్లాలో అధికారులు కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారిక ఆదేశాల ప్రకారం ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు ఈ...