పేదల వైద్యానికి సీఎం సహాయ‘హస్తం’

14 మందికి రూ.6.30 లక్షల చెక్కులు.. ఇంటింటికీ వెళ్లి అందజేసిన జ్యోతుల నవీన్ గండేపల్లి, పెన్ పవర్ ,ఆగస్టు 27: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. గండేపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.6.30 లక్షల విలువైన 14 చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు. నీలాద్రిరావుపేటలో నలుగురికి, తాళ్లూరులో ఇద్దరికి, మల్లేపల్లిలో ముగ్గురికి, యల్లమల్లిలో ఒకరికి,...