మంత్రివర్గ ప్రక్షాళనపై మళ్లీ చర్చ

స్థానిక ఎన్నికల తర్వాత కేబినెట్‌పై సీఎం సమీక్ష?.. పనితీరే ప్రామాణికంగా మారే అవకాశం విజయవాడ, ఆగస్టు 8, పెన్ పవర్: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ మంత్రివర్గ ప్రక్షాళన అంశం తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం మంత్రుల పనితీరును సమీక్షించి, అవసరమైతే కేబినెట్‌లో మార్పులు చేపట్టే అవకాశం ఉందన్న చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో శాఖల పనితీరు, ప్రభుత్వ...