శాఖంబరి రూపంలో జగన్మాత దివ్యదర్శనం

అంకెం వారి ఆడపడుచుల భక్తి సేవతో వైభవంగా అమ్మవారి అలంకరణ పెడన, పెన్ పవర్, ఆగస్టు 2: భక్తుల కోరికలు తీర్చే కరుణామయి జగన్మాత శ్రీ విజయ ఆమలేశ్వరి దేవి ఆదివారం శాఖంబరి రూపంలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చి ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తారు. పెడన మండలం దావోజిపాలెం గ్రామంలోని శ్రీ విజయ ఆమలేశ్వరి దేవి ఆలయంలో నిర్వహించిన ఈ ప్రత్యేక అలంకరణ మహోత్సవం భక్తిశ్రద్ధలకు ప్రతీకగా నిలిచింది. ఈ వేడుకకు మరో విశిష్టత ఏమిటంటే... ఆలయ ఉత్సవాన్ని అంకెం వారి ఆడపడుచులు సంపూర్ణ భక్తి,...