ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి

పోలవరం జిల్లా బీజేపీ డిమాండ్ గంగవరం పెన్ పవర్, ఆగస్టు 24: పోలవరం జిల్లాలో సస్పెన్షన్‌కు గురైన 22 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పోలవరం జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సస్పెన్షన్ కాలం ముగిసి ఎనిమిది నెలలు గడిచినా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం అన్యాయమని పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో పోలవరం జిల్లాలోని 11 మండలాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు...