మొక్కల పెంపకం తోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యం

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ ,ఆగస్టు 9: మొక్కలను సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీఎల్‌ఎస్‌సీ కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రంపచోడవరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మురళి గంగాధర రావు పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రంపచోడవరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి, మురళి గంగాధర రావు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ...