మన్యం బంద్‌కు ఆటంకాలు కల్పించవద్దని ప్రభుత్వానికి హ్యూమన్ రైట్స్ వాచ్ విజ్ఞప్తి

  రంపచోడవరం, ఆగస్టు 6 (పెన్ పవర్): ఆగస్టు 8న ప్రతిపాదిత "మాన్యం బంద్" సందర్భంగా శాంతియుత సమావేశాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు, బంద్ నిర్వహణకు ఎలాంటి చట్టవిరుద్ధ ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపినట్లు తెలిపారు. వినతిపత్రంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగల స్థానిక ఉద్యోగ హక్కులను పరిరక్షించే జి.ఓ....