ఉద్యోగులను ఆర్థిక భారంగా చిత్రీకరించడం సరికాదు

శ్వేతపత్రంలోని వ్యాఖ్యలపై ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం ఆగ్రహం గంగవరం పెన్ పవర్, ఆగస్టు 9: ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వ ఆర్థిక భారంగా చిత్రీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో చేసిన వ్యాఖ్యలను ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఉద్యోగులే ప్రభుత్వ ఆర్థిక సమస్యలకు కారణమన్నట్లుగా ప్రచారం చేయడం సరికాదని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఎ. రతన్ రాజ్ పేర్కొన్నారు.ప్రభుత్వ ఆదాయంలో 98 శాతం ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు....