విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
*విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్* బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 5: విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భూమిపూజ చేశారు. ముందుగా తోటగరువులోని అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు పీవీ సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు...