సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈనాడు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫోన్ ద్వారా వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.

ఈనాడు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు విశేష స్పందన గంటలోనే 40 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి, ఆగస్టు 8 (పెన్ పవర్): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈనాడు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శనివారం పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఈనాడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు...