ముస్తఫా అరెస్టు రాజకీయ కక్షసాధింపే: వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం నేతలు
ముస్తఫా అరెస్టు రాజకీయ కక్షసాధింపే: వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం నేతలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 5: మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం నాయకులు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముస్తఫాపై నమోదు చేసిన కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు జహీర్ అహ్మద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష...