మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి నల్లారి..?

జల వివాదాలపై స్పందనతో రాజకీయంగా కొత్త సంకేతాలు సుదీర్ఘ మౌనం వీడిన మాజీ సీఎం... బీజేపీలో పెరగనున్న పాత్రపై ఊహాగానాలు స్టేట్ పోలిటికల్ బ్యూరో పెన్ పవర్ అమరావతి, ఆగస్టు 5 : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతకాలంగా పెద్దగా చురుకుగా కనిపించని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి ప్రజా చర్చలోకి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలపై మీడియా సమావేశం నిర్వహించి తన అభిప్రాయాలను వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చాలా కాలం తర్వాత...