సెప్టెంబర్ 12న జాతీయ లోక్‌అదాలత్
రాజీ మార్గంలో కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, ఆగస్టు 13: జాతీయ లోక్‌అదాలత్ ద్వారా కేసులను పరస్పర అంగీకారం, రాజీ మార్గంలో సత్వరమే పరిష్కరించుకోవచ్చని మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, రంపచోడవరం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఎం. మురళి గంగాధరరావు తెలిపారు.సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై గురువారం రంపచోడవరం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టు హాలులో పోలీసులు, న్యాయవాదులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌అదాలత్ నిర్వహణ, కేసుల గుర్తింపు,...