స్థానిక ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం
మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఈవీఎంలా?.. బ్యాలెట్ బాక్సులా? 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలపై దృష్టి.. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈసీ ఆదేశాలు ఒంగోలు, పెన్ పవర్ ఆగస్టు 8,: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగం పుంజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా ఎదుర్కొనేలా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ అంశాలు, కోర్టు కేసులు, ఓటర్ల జాబితాలు, ఎన్నికల సామగ్రి,...