ఆగస్టు 11న ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’..?

స్వాతంత్య్ర పిలుపుతో మళ్లీ ప్రపంచ దృష్టి బలూచ్ ఉద్యమంపై..! చారిత్రక వివాదాలు.. సహజ వనరుల రాజకీయాలు.. మానవ హక్కుల ఆరోపణలు..! స్వతంత్ర దేశమా..? లేక గుర్తింపు కోసం సాగుతున్న రాజకీయ పోరాటమా..? న్యూఢిల్లీ, పెన్ పవర్, ఆగస్టు 5: దక్షిణాసియా రాజకీయాల్లో దశాబ్దాలుగా వివాదాస్పద అంశంగా కొనసాగుతున్న బలూచిస్తాన్ ప్రశ్న మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువైంది. పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్‌గా ఉన్న బలూచిస్తాన్‌కు చెందిన కొందరు జాతీయవాద నాయకులు ఇటీవల "రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్" పేరుతో స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తున్నట్లు ప్రకటించి, ఆగస్టు 11ను స్వాతంత్య్ర...