అక్షర ఆంధ్ర స్వచ్ఛంద ఉపాధ్యాయులకు శిక్షణ

  గండేపల్లి, పెన్ పవర్ ,ఆగస్టు 27: గండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద ఉపాధ్యాయులకు మండలస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వయోజన విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది శ్రీ తేజేశ్వరరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వచ్ఛంద ఉపాధ్యాయులకు అక్షరాస్యత కార్యక్రమం నిర్వహణ, బోధనా విధానాలు, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో స్వచ్ఛంద ఉపాధ్యాయుల...