ఆదివాసీ ‘జల్–జంగల్–జమీన్’ హక్కులు ఏనాటికి సాధ్యం?
ఆరు దశాబ్దాల్లో ఆరు కోట్ల స్థానభ్రంశం.. అందులో 40 శాతం ఆదివాసులే! అభివృద్ధి పేరుతో ప్రాజెక్టులు వస్తున్నాయి.. భూములు పోతున్నాయి.. తరతరాలుగా అడవినే జీవనాధారంగా చేసుకున్న ఆదివాసీలకు మాత్రం పునరావాసం, పరిహారం, హక్కులు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. జల్–జంగల్–జమీన్ నినాదం దశాబ్దాలుగా మార్మోగుతున్నా, ఆచరణలో ఆదివాసీ జీవితం మాత్రం పునరావృత స్థానభ్రంశం, పేదరికం, నిర్లక్ష్యంతోనే సాగుతోంది. ఎడిటర్, పెన్ పవర్ ఆగష్టు 10: అభివృద్ధి పేరుతో ఆదివాసీ నిర్వాసితులు : దేశ జనాభాలో ఆదివాసీలు సుమారు 8.6 శాతం మాత్రమే. అధికారిక గణాంకాల ప్రకారం...