కేసుల సుడిగుండంలో వైఎస్సార్‌సీపీ నేతలు..!
రాజకీయ కక్షా..? లేక చట్టపరమైన సంక్షోభమా..? అరెస్టులు.. ముందస్తు బెయిళ్లు.. ఆజ్ఞాతం.. ప్రతిపక్షానికి పెరుగుతున్న పరీక్ష పెన్ పవర్ ప్రత్యేక కథనం, విజయవాడ, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చ అంతా ఒకే అంశం చుట్టూ తిరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, కీలక నాయకులు వరుసగా వివిధ క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. కొందరు అరెస్టు అవుతుండగా, మరికొందరు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపులు తడుతున్నారు. ఇంకొందరు పోలీసుల...