అక్రమంగా చేపట్టిన రీవేరా ఫంక్షన్ హాల్ పై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 21: ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించి, గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్న రీవేరా ఫంక్షన్ హాల్ పై చర్య తీసుకోవాలని ఉప్పరిగూడ గ్రామ ఉపసర్పంచ్ ఎన్ను కావ్య వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వార్డు సభ్యులు నర్కుడి మహేందర్, కొంగరి రవితేజ తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం ఖల్సా (ఉప్పరిగూడ గ్రామం) రెవెన్యూ పరిధి, సీవిఆర్ కళాశాల సమీపంలో "రీవేరా ఫంక్షన్...