అన్నదానం పరబ్రహ్మ స్వరూపం: కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ తిరుపతిరెడ్డి

    ఖమ్మం పెన్ పవర్ సెప్టెంబర్ 19: భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అన్నదానం చేయడం అభినందనీయమని మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. తొలుత కమిటీ సభ్యుడు యాస లక్ష్మారెడ్డి కమిషనర్, ఏసీపీ, సీఐలకు వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు జరిపించి...