ఆర్గానిక్ అగరబత్తులతో మహిళల స్వయం ఉపాధికి కొత్త బాట
గొల్లపాలెంలో శిక్షణ కేంద్రం.. తయారీతో పాటు మార్కెటింగ్‌పై ప్రత్యేక శిక్షణ స్థానిక ఉత్పత్తులకు స్థానిక మార్కెట్.. 500 నుంచి 1000 మంది మహిళలకు శిక్షణ లక్ష్యం కాజులూరు, పెన్‌పవర్, సెప్టెంబర్ 22: మహిళల చేతుల్లో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తే వారు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోగలరనే ఆలోచనతో గొల్లపాలెంలో ఆర్గానిక్ అగరబత్తుల తయారీకి శ్రీకారం చుట్టారు. కుటీర పరిశ్రమగా అగరబత్తుల తయారీని అభివృద్ధి చేసి, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు స్థానికంగా తయారైన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్లే...