ఉన్నత విద్యకు పట్టభద్రుల సంఘం చేయూత

వేటపాలెం, సెప్టెంబర్ 25 : పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కుమారి పి. లక్ష్మీ హాసినికి ఆర్థిక సహాయం అందించారు. ఉన్నత విద్య కొనసాగించేందుకు ఆమె చేసిన విజ్ఞప్తి మేరకు సంఘం తరఫున రూ.6 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసి, భవిష్యత్తులో వైద్య వృత్తిలో సేవాతత్పరతతో పనిచేయాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం సంఘం ప్రధాన ఆశయమని తెలిపారు....