ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా జరుబుల శ్రావణి ఎంపిక
2026-27 విద్యా సంవత్సరానికి బాధ్యతలు చేపట్టనున్న వేటపాలెం పీఈటీ వేటపాలెం, సెప్టెంబర్ 19 (పెన్ పవర్): 2026-27 విద్యా సంవత్సరానికి బాపట్ల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శిగా వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న జరుబుల శ్రావణి ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి. శ్రీనివాస్ సింగ్ శుక్రవారం ధ్రువీకరించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయిని దేవరకొండ సరోజిని శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయిని శ్రావణిని ఘనంగా సత్కరించి అభినందించారు. పాఠశాల స్టాఫ్ సెక్రటరీ...