ఏపీ మోడల్‌ స్కూల్‌ ఎస్ఎంసీ ఎన్నికలపై వివాదం

నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక జరిగిందని కొందరు తల్లిదండ్రుల ఆరోపణలు సీసీ ఫుటేజ్‌ పరిశీలించి సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చీరాల, సెప్టెంబర్‌ 29 : చీరాల ఏపీ మోడల్‌ స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు వివాదానికి దారితీశాయి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరగలేదని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, కుకింగ్‌ విభాగం, ఇతర సిబ్బందిపై పలు ఆరోపణలు, కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై మరింత చర్చ...