కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన.. మోసపూరితమే: హరిప్రియ నాయక్

  గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలన అంతా మోసపూరితమేనని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజా పాలన పేరుతో మోసపూరిత పాలన చేస్తున్నాడని ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలలో విఫల పాలనను నిరసిస్తూ గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ కూడలిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వంట వార్పు కార్యక్రమాన్ని...