కాజులూరులో బుద్ధపూజా కార్యక్రమం
అంబేడ్కర్ ఆశయాలను నేటి తరానికి చేరువ చేయాలి కాజులూరు, పెన్‌పవర్, సెప్టెంబర్ 13: కాజులూరు మండల పరిధిలోని కాజులూరు అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఆదివారం చిన్నారులచే బుద్ధపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం త్రిరత్న బుద్ధవిహార్‌లో శ్రీ భీమ్‌రావ్ రాంజీ ప్రజాసంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, పూర్వ సంఘం పెద్దలు, సభ్యులు సమావేశమయ్యారు.సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా సంఘ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి సభ్యులు తమ సూచనలు, సలహాలు అందించాలని సమావేశంలో సూచించారు. మండలంలోని గ్రామాల్లో ప్రతి నెల డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనా...