కాజులూరు మండలంలో ప్రత్యేక అధికారి సమీక్ష
ఎన్నికల నిర్వహణతో పాటు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి కాజులూరు, సెప్టెంబర్ 26 పెన్ పవర్: కాజులూరు మండల ప్రత్యేక అధికారిగా నియమితులైన డ్వామా పీడీ ఎస్. మధుసూదన్ ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం కాజులూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యాలయానికి చేరుకున్న ప్రత్యేక అధికారికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె. రాంబాబు, కార్యాలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం మండల పరిధిలోని అన్ని గ్రామాల...