కారు ప్రమాదంలో వైద్యుడి సజీవ దహనం
ఖమ్మం, పెన్ పవర్, సెప్టెంబర్ 20: సూర్యాపేటలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ-హైదరాబాద్ హైవే మీద ఉన్న పిల్లలమర్రి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓల్వో కారు డివైడర్ ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కారులో ప్రయాణిస్తున్న ఖమ్మం మమత హాస్పిటల్ కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసుకుర్తి జగదీష్ సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో డాక్టర్ కాసుకుర్తి జగదీష్ మరణించడంతో పలువురు సంతాపం వ్యక్తం చేశారు.