కుటీర పరిశ్రమలతో మహిళలకు ఆర్థిక స్వావలంబన

తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దే స్వయం ఉపాధికి అవకాశం అగరబత్తుల తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సుభాష్‌ కాజులూరు, పెన్‌పవర్‌, సెప్టెంబర్‌ 16: గ్రామీణ మహిళలు తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవచ్చని జనసేన మహిళా నేత, ఏఎంసీ డైరెక్టర్‌ సలాది పుష్పవతి అన్నారు. మహిళలు వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అగరబత్తుల తయారీ, క్యాండిల్‌ తయారీ వంటి కుటీర పరిశ్రమలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. కాజులూరు...