కుటుంబానికి ₹50 వేల ఆర్థిక సాయం అందించిన గుండ్రెడ్డి శివ
బాపట్ల, సెప్టెంబర్27 : ఆపదలో ఉన్నవారికి "నేనున్నానంటూ" అండగా నిలిచే దాతృత్వ హృదయుడు గుండ్రెడ్డి శివ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇటీవల చెరువు ఉప్పరపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ మరియు ఆమె కుమారుడు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి (కరెంట్ షాక్) గురై అక్కడికక్కడే మృతి చెందిన సంగతి విదితమే. ఈ దారుణ ఘటన గురించి తన అనుచరుల ద్వారా తెలుసుకున్న శివ తీవ్రంగా చలించిపోయారు. సమాచారం అందుకున్న మరుక్షణమే బాధిత కుటుంబం వద్దకు చేరుకుని వారిని పరామర్శించి, ఓదార్చారు. ఈ...