కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన

చీరాల, సెప్టెంబర్ 29 : చీరాలలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ శాఖ అధికారి రాజారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగ అవకాశాలు, నియామక ప్రక్రియ, పోటీ పరీక్షలు, అర్హతలు, పరీక్షలకు సిద్ధమయ్యే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య పోర్టల్‌లో ఇంటర్వ్యూ విధానంపై కూడా విద్యార్థులకు వివరించారు....