కొండచిలువ కలకలం: సురక్షితంగా పట్టుకుని తపస్సు కొండ ఫారెస్ట్ లో విడిచిపెట్టిన అధికారులు…
అడ్డతీగల, పెన్ పవర్, సెప్టెంబర్ 29:అడ్డతీగల స్థానిక సీతపల్లి జంక్షన్ సమీపంలో గల కల్వర్టువద్ద మంగళవారం భారీ కొండచిలువ ప్రత్యక్షమైస్థానికులను భయాందోళనకు గురిచేసింది.రహదారిలొ ఉన్న కల్వర్టు వద్ద కొండచిలువకదలికలను గమనించిన స్థానికులు వెంటనేఅటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ డీ ఆర్ ఓ యోగేంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ ఈశ్వర్‌ను అప్రమత్తం చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఈశ్వర్, చాకచక్యంగా వ్యవహరించి కొండచిలువను సురక్షితంగా బంధించారు. పట్టుబడిన...