గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

  గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 11: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్‌శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గార్ల ఎస్‌ఐ సాయికుమార్ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులకు గార్ల పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించి ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అనుమతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపానికి తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతి పొందాలని సూచించారు. పోలీస్‌శాఖ అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. డీజేలకు...