గణేష్ లడ్డూను దక్కించుకున్న వేముల సుమన్ గౌడ్

  హైదరాబాద్, పెన్ పవర్, సెప్టెంబర్ 21: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని రాంనగర్ లో గల్లీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో గణనాథుడు విశేష పూజలు అందుకున్నాడు. ఉత్సవాలలో భాగంగా సోమవారం నిర్వహించిన గణనాథుడి చేతిలోని లడ్డూను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల సుమన్ గౌడ్ దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకున్న వేముల సుమన్ గౌడ్, సౌమ్య దంపతులను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా...