గార్లను కరువు మండలంగా ప్రకటించాలి
గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 21: వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గార్ల మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఎం నాయకులు సీపీఎం జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి,లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతుల పరిస్థితిపై...