గార్లలో అవగాహన సదస్సు నిర్వహించాలి: డీఎస్పీని కోరిన కాంగ్రెస్‌ నాయకులు

  గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 5: యువత గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం మహబూబాబాద్ జిల్లా డీఎస్పీ తిరుపతిరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. గార్ల మండలంలోని వివిధ గ్రామాల్లో యువత, విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఎస్పీని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత చెడు అలవాట్ల బారిన పడకుండా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక...