గిరిజన యువతి హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో ప్రదర్శన
గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 4: ఆదివాసీ గిరిజన యువతి, ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీషపై హత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు షాన్ ఉల్లా ఖాన్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం గార్ల మండల కేంద్రంలోని నెహ్రూ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి...